Andhra Pradesh: పొత్తు విషయంలోనూ చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు: శిల్పాచక్రపాణిరెడ్డి ధ్వజం

  • తెలంగాణలో పొత్తంట...ఆంధ్రాలో ఛాలెంజ్‌ అంట
  • కాంగ్రెస్‌తో పొత్తును ప్రజలు హర్షించరు  
  • నవరత్నాలతోనే అభివృద్ధి అని స్పష్టీకరణ
అన్నివేళలా రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌తో పొత్తు విషయంలోనూ దాన్నే పాటిస్తున్నారని నంద్యాల వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తంట, ఆంధ్రాలో ఛాలెంజ్‌ అంట అని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో పొత్తును ప్రజలు హర్షించరని, తగిన సమయంలో బాబుకు బుద్ధి చెబుతారని అన్నారు.

 హామీలను తుంగలో తొక్కేసి నాలుగేళ్లు గడిపిన చంద్రబాబు ఇప్పుడు ‘నిరుద్యోగ భృతి’ వంటి మాయమాటలతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని, ప్రజలు దీన్ని గమనించాలని కోరారు. బాబ్లీ కేసులో ఎన్నోసార్లు నోటీసులు వచ్చినా పట్టించుకోని చంద్రబాబు బీజేపీతో తెగదెంపులయ్యాక వారెంటుతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. నవరత్నాలతోనే అభివృద్ధి అని స్పష్టీకరించారు.  ‘కావాలి జగన్...రావాలి జగన్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 
Andhra Pradesh
shilpa

More Telugu News