allu arjun: త్రివిక్రమ్ తోనే బన్నీ నెక్స్ట్ మూవీ?

  • ఇంతవరకూ ఏ కథను ఓకే చేయని బన్నీ 
  • కథపై కసరత్తు చేస్తోన్న విక్రమ్ కుమార్ 
  • త్రివిక్రమ్ పై దృష్టిపెట్టిన బన్నీ  
'నా పేరు సూర్య' తరువాత తన తదుపరి సినిమా విషయంలో బన్నీ ఇంతవరకూ ఒక నిర్ణయానికి రాలేకపోయాడు. విక్రమ్ కుమార్ తో ఆయన సినిమా వుండనున్నట్టు వార్తలు వస్తున్నా, అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. విక్రమ్ కుమార్ కథల్లో తన నుంచి ఆడియన్స్ ఆశించే మాస్ అంశాలు తక్కువగా ఉంటాయని బన్నీ భావిస్తున్నాడట.

ఒక వైపున బన్నీవాసు .. మరో వైపున వక్కంతం వంశీ కూడా బన్నీకి నచ్చే కథను సెట్ చేయడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే 'నా పేరు సూర్య' తరువాత ప్రయోగాల జోలికి పోకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయాలని బన్నీ బలంగా భావిస్తున్నాడట. 'అరవింద సమేత' పనులు పూర్తికాగానే త్రివిక్రమ్ .. బన్నీ మధ్య చర్చలు జరగనున్నట్టు సమాచారం. వెంకటేశ్ తో కంటే ముందు బన్నీతోనే త్రివిక్రమ్ సినిమా చేసే ఛాన్స్ ఉందనేది ఫిల్మ్ నగర్ టాక్.   
allu arjun
trivikram

More Telugu News