Maruti Rao: పరువు హత్యకు పాల్పడిన మారుతీరావును అరెస్ట్ చేసి తీసుకెళుతున్న వీడియో!

  • కులాంతర వివాహం చేసుకుందని పరువు హత్య
  • మారుతీరావును అరెస్ట్ చేసినప్పటి వీడియో
  • సోషల్ మీడియాలో వైరల్
తన అభీష్టాన్ని కాదని కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కారణంతో అల్లుడిని దారుణాతి దారుణంగా హత్య చేయించిన మిర్యాలగూడ వ్యాపారి మారుతీరావును అరెస్ట్ చేసి తీసుకెళుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. పోలీసులు మారుతీరావును గట్టిగా పట్టుకుని వ్యాన్ ఎక్కించేందుకు వేగంగా తీసుకు వెళుతున్న వేళ, మీడియా చుట్టుముట్టి, ఎందుకు హత్య చేశారని పదేపదే ప్రశ్నించడం ఈ వీడియోలో వినిపిస్తోంది. మీడియా ప్రశ్నలకు ఏ మాత్రం స్పందించని మారుతీరావు, పోలీసుల సాయంతో వెళ్లి వ్యానులో కూర్చుండిపోయాడు. ఆ వీడియోను మీరూ చూడండి.
Maruti Rao
Miryalaguda
Honor Killing
Police
Arrest
Media

More Telugu News