Asia cup: ఆసియాకప్‌లో నేడు భారత్-పాక్ మ్యాచ్.. హాజరు కానున్న దావూద్ ఇబ్రహీం అనుచరులు!

షార్ట్స్‌లో చూడండి
ఆసియాకప్‌లో భాగంగా నేడు దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. దాయాదుల పోరుకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. దావూద్ అనుచరులు మ్యాచ్‌కు హాజరు కాబోతున్నట్టు వార్తలు రావడంతో కరాచీ, ముంబైలో ఉన్న దావూద్ కుటుంబ సభ్యులు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నట్టు ఆరు అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. దీంతో అందరి దృష్టి భారత్-పాక్ మ్యాచ్‌పైకి మళ్లింది.

ఈ మ్యాచ్‌కు దావూద్ అనుచరులు హాజరవుతున్నట్టు వార్తలు రావడంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు నిఘాను తీవ్రతరం చేశాయి. వీరిపై నిఘా ద్వారా దావూద్ చీకటి సామ్రాజ్యాన్ని మరింత క్షుణ్ణంగా తెలుసుకునే వీలుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌తో పాటు యూకే, యూఎస్‌, రష్యా, చైనా సంస్థలు కూడా భారత్-పాక్ మ్యాచ్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Asia cup
India
Pakistan
Dawood Ibrahim
Mafia dwan

More Telugu News