sharwanand: గీతా ఆర్ట్స్ బ్యానర్లో దసరాకి మరో సినిమా ప్రారంభం?

షార్ట్స్‌లో చూడండి
లవ్ .. ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా శ్రీకాంత్ అడ్డాల తన చిత్రాలను తెరకెక్కిస్తూ వచ్చాడు. 'కొత్త బంగారులోకం' .. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి సినిమాలు ఆయన ప్రతిభకి అద్దం పట్టాయి. ఆ తరువాత ఆయన మహేశ్ బాబుతో చేసిన 'బ్రహ్మోత్సవం' పరాజయంపాలు కావడంతో, అవకాశాలు ముఖం చాటేశాయి. అప్పటి నుంచి ఆయన తన సత్తాను మరోసారి చాటుకునే ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన ఇటీవల అల్లు అరవింద్ ను కలిసి ఒక కథ చెప్పాడట. కథ కొత్తగా ఉండటం వలన తమ బ్యానర్లో ఆ సినిమా చేయడానికి అల్లు అరవింద్ అంగీకరించాడని అంటున్నారు. ఈ సినిమాలో హీరోగా శర్వానంద్ చేయనున్నట్టు తెలుస్తోంది. దసరాకి ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ తరువాత రెగ్యులర్ షూటింగుకి వెళతారని అంటున్నారు.       
Go Back to Shorts
sharwanand
srikanth addala

More Telugu News