ntr: 'అరవింద సమేత' నుంచి రేపు రెండో పాట

  • 'అనగనగనగా' సాంగ్ కి మంచి రెస్పాన్స్ 
  • రాయలసీమ నేపథ్యంలో మరోపాట 
  • ముఖ్యపాత్రల్లో జగపతిబాబు .. నాగబాబు
'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు త్రివిక్రమ్ ముందుగానే ప్రకటించారు. అందువలన ఆ దిశగా ఈ సినిమాకి సంబంధించిన పనులు చకచకా పూర్తి చేస్తున్నారు. ఒక వైపున చిత్రీకరణను పూర్తి చేస్తూ .. మరో వైపున ఒక్కో లిరికల్ వీడియోను వదులుతున్నారు.

అలా రీసెంట్ గా 'అనగనగనగా.. ' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో రేపు సాయంత్రం 4.50 గంటలకు 'పెనివిటి ..' అనే రెండో పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. రాయలసీమ ఆచార వ్యవహారాల నేపథ్యంలో చిత్రీకరించిన పాటగా దీనిని గురించి చెబుతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, జగపతిబాబు .. నాగబాబు కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.   
ntr
pooja hegde

More Telugu News