Miryalaguda: కాంట్రాక్టు... సబ్ కాంట్రాక్టు... సబ్-సబ్ కాంట్రాక్టు... పరువు హత్య వెనుక తవ్వేకొద్దీ నమ్మలేని నిజాలు!

  • తన గురువు అస్గర్ అలీని రంగంలోకి దించిన బారీ
  • భారీ స్కెచ్ వేసి ప్రణయ్ హత్యకు అస్గర్ కుట్ర
  • ఆపై నమ్మకమైన అనుచరుడితో దాడి
మిర్యాలగూడలో సంచలనం కలిగించిన పరువు హత్య కేసు విచారణలో తవ్వేకొద్దీ సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు ఇష్టం లేకుండా తన కుమార్తె అమృత వర్షిణిని పెళ్లి చేసుకున్నాడన్న ఆగ్రహంతో ప్రణయ్ ని చంపించాలని గట్టిగా నిర్ణయించుకున్న మారుతీరావు, ఈ హత్యకు ప్రధాన కుట్రదారుడని పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో కాంగ్రెస్ నేత కరీమ్ పేరు తరువాత బయటకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన బారీకి ప్రణయ్ హత్య కాంట్రాక్టును అప్పగించి, అతనికి మిర్యాలగూడలో కరీమ్ ఆశ్రయం కల్పించాడని కూడా పోలీసులు గుర్తించారు.

 ఆపై బారీని అరెస్ట్ చేసి విచారించగా, ఐఎస్ఐ వద్ద శిక్షణ పొంది వచ్చిన అస్గర్ అలీ పేరు బయటకు వచ్చింది. రూ. కోటికి బేరం కుదుర్చుకున్న బారీ, అస్గర్ కు సబ్ కాంట్రాక్టు ఇచ్చాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. భారీ స్కెచ్ వేసి చాలా ధైర్యంగా ప్రణయ్ ని హత్య చేయాల్సి వుంటుందని భావించిన బారీ, తనకు గురువు సమానమైన అస్గర్ అలీకి విషయాన్ని చెప్పి, అతన్నే స్వయంగా రంగంలోకి దించాడు. దీంతో అస్గర్ కూడా మిర్యాలగూడకు వచ్చి పక్కాగా ప్లాన్ చేసి సలహాలు, సూచనలు ఇచ్చి, తనకు నమ్మకమైన ఓ అనుచరుడి ద్వారా దాడి చేయించినట్టు పోలీసులకు బారీ తెలిపినట్టు సమాచారం. ఇందుకోసం అతనికి రూ. 10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారట. 
Miryalaguda
Asghar Ali
Pranay
Honor Killing

More Telugu News