Rakshit Shetty: రక్షిత్ తో పెళ్లి రద్దుపై తొలిసారిగా స్పందించిన హీరోయిన్ రష్మిక!

  • రక్షిత్ తో నిశ్చితార్థం తరువాత వరుస హిట్లు
  • ఆపై రక్షిత్ తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న రష్మిక
  • తనను ప్రశాంతంగా ఉండనివ్వాలని వేడుకోలు
రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం తరువాత వరుస హిట్లతో పాప్యులర్ అయి, అటు కన్నడ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో డిమాండున్న హీరోయిన్ గా మారిన రష్మిత మందన, తనపై వస్తున్న విమర్శలపై తొలిసారిగా వివరణ ఇచ్చింది. రక్షిత్ తో ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ పై ఇంతకాలం తాను మౌనంగా ఉండి తప్పు చేశానని ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించిన ఆమె, తనపై వస్తున్న కథనాలు, ట్రోల్స్ అన్నీ చూస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చింది.

బయట తనను ఎలా చూస్తున్నారన్న విషయాన్ని తలచుకుంటేనే బాధగా ఉంటోందని, దీనికి తాను ఎవరినీ నిందించదలచుకోలేదని చెప్పింది. బయటి వ్యక్తులు నమ్ముతున్నది నిజం కాదని చెప్పేందుకు తన తరఫున ఎవరూ రాలేదని వాపోయింది. ప్రతి నాణానికీ బొమ్మ, బొరుసు ఉన్నట్టే, ప్రతి కథకూ రెండు కారణాలుంటాయని, తనను ప్రశాంతంగా ఉండనివ్వాలని వేడుకుంది. తాను భాషాభేదాలు లేకుండా రెండు భాషల్లో నటనను కొనసాగిస్తానని చెప్పింది.
Rakshit Shetty
Rashmika Mandanna
Engagement
Cancel
Troling

More Telugu News