jc diwakar reddy: ఆందోళన విరమించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి

  • ఆశ్రమ నిర్వాహకులతో జిల్లా కలెక్టర్ చర్చలు సఫలం
  • ఆశ్రమం నుంచి వెళ్లిపోయేందుకు అంగీకరించిన స్థానికేతరులు
  • ఆందోళన విరమించిన జేసీ
తాడిపత్రి మండలంలోని చిన్నపొడమలలో ప్రబోధానంద స్వామి ఆశ్రమ నిర్వాహకులకు, గ్రామస్తులకు మధ్య గత రెండు రోజులుగా నెలకొన్న వివాదానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్, పోలీసు ఉన్నతాధికారులు ఆశ్రమ నిర్వాహకులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి.

రెండు దఫాలుగా జరిపిన చర్చల్లో... ఆశ్రమంలో ఉన్న స్థానికేతరులు అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు అంగీకరించారు. దీంతో, వారిని సాయుధ బలగాల మధ్య ఆశ్రమం నుంచి తరలించారు. దీంతో, ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలంటూ గత 30 గంటలుగా చేస్తున్న ఆందోళనను దివాకర్ రెడ్డి విరమించారు. స్థానికేతరులను ఆశ్రమం నుంచి తరలిస్తున్నారని పోలీసులు చెప్పడంతో... తాడిపత్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయన వెళ్లిపోయారు. 
jc diwakar reddy
prabodhananda swamy

More Telugu News