Shahrukh Khan: నువ్వసలు ముస్లింవేనా?: షారుఖ్ ఖాన్ పై విమర్శలు

  • ముస్లిం అయి ఉండి వినాయకుడికి పూజ చేస్తావా?
  • ఇస్లాంలో విగ్రహారాధనకు చోటు లేదు
  • గణేష్ చతుర్థి ఎలా చేసుకుంటావు?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పై కొందరు ముస్లింలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నీవసలు ముస్లింవేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ముస్లిం అయి ఉండి ఇంట్లో వినాయకుడి విగ్రహం పెట్టుకుని, పూజ చేస్తావా? అని మండిపడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే, ఇంట్లో తన చిన్న కుమారుడు అబ్ రామ్ వినాయకుడికి పూజ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షారుఖ్ అప్ లోడ్ చేశాడు. 'మా చిన్నోడు పిలిచాడు. గణపతి బప్పా ఇంటికి వచ్చాడు' అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టాడు. దీనిపై కొందరు ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లాంలో విగ్రహారాధనకు చోటు లేదని... అలాంటప్పుడు నువ్వెలా పూజలు చేస్తావంటూ మండిపడ్డారు. ముస్లింవి అయివుండి... గణేష్ చతుర్థి చేసుకుంటావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Shahrukh Khan
ganesh
chaturthi
troll

More Telugu News