Telangana: ప్రణయ్‌ హత్యకేసు నిందితుడు మారుతీరావు కారు స్వాధీనం!

  • నల్లగొండ సావర్కర్‌నగర్‌ పద్మజ్యోతి కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వద్ద వాహనం
  • వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
  • స్థానికుల సమాచారంతో వెళ్లి స్టేషన్‌కి తెచ్చిన పోలీసులు
సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్యకేసు నిందితుడు, అమృతవర్షిణి తండ్రి మారుతీరావు కారు (నంబర్‌ ఏపీ 24ఏజెడ్‌ 1111) ను నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సావర్కర్‌నగర్‌ పద్మజ్యోతి కమర్షియల్‌ కాంప్లెక్స్‌ వద్ద ఈ కారును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. దీన్ని గుర్తించిన కమర్షియల్‌ కాంప్లెక్స్‌కు చెందిన ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కాంప్లెక్స్‌ వద్దకు చేరుకుని కారును స్టేషన్‌కు తీసుకువచ్చారు.
Telangana
Nalgonda District

More Telugu News