Krishna District: అవనిగడ్డను వీడని సర్ప భయం... ఇద్దరు చిన్నారులకు పాము కాటు!

  • లంకమ్మ మాన్యం కాలనీలో ఘటన
  • నిద్రిస్తున్న వేళ అన్నదమ్ములను కాటేసిన పాము
  • ప్రాణాపాయం లేదన్న వైద్యులు
కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతాన్ని పాముల భయం ఇంకా వీడలేదు. తాజాగా, లంకమ్మ మాన్యం కాలనీలో నివాసం ఉంటున్న తోట గంగాధర్ ఇద్దరు బిడ్డలను పాము కాటేసింది. వేణుమాధవ్ (5), నవీన్ కుమార్ (3)లు నేలపై నిద్రిస్తుండగా, ఇంట్లోకి ప్రవేశించిన పాము, ఇద్దరినీ కాటేసింది. ఇద్దరూ లేచి పెద్దగా ఏడుస్తూ ఉండటంతో గంగాధర్ లేచి లైట్లు వేసి చూడగా, ఇద్దరి కాలి నుంచి రక్తం వస్తూ, గాట్లు కనిపించాయి.

పాము కరిచిందని తెలుసుకున్న అతను, ఇద్దరినీ స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరిద్దరికీ ప్రాణాపాయం లేదని, అయితే, ఒక రోజు పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు సూచించారు. కాగా, మరో ఇద్దరిని కూడా పాములు కాటేయగా, వీరు అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Krishna District
Avanigadda
Sanke
Bite

More Telugu News