surya: పవర్ ఫుల్ 'కమాండో'గా సూర్య!

  • కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య
  • ఈ కాంబినేషన్లో ఇది మూడో మూవీ 
  • కీలకపాత్రల్లో మోహన్ లాల్ .. ఆర్య   
జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా సూర్య వరుస సినిమాలు చేసేసుకుంటూ వెళుతున్నాడు. తనకి హిట్ ఇచ్చిన దర్శకులకు మళ్లీ మళ్లీ అవకాశాలను ఇవ్వడం సూర్యకు అలవాటు. అలా గతంలో 'వీడొక్కడే' .. 'బ్రదర్స్' వంటి చిత్రాలతో తనకి మంచి గుర్తింపు తెచ్చిన కేవీ ఆనంద్ తో సూర్య ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు.

ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన సూర్య లుక్ బయటికి వచ్చింది. ఆయన డిఫరెంట్ లుక్ చూసిన అభిమానులు .. ఇందులో ఆయన పాత్ర ఏమై ఉంటుందా? అనే ఆసక్తికి లోనయ్యారు. ఈ సినిమాలో ఆయన పవర్ ఫుల్ కమాండో పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో సూర్య కాంబినేషన్లోని యాక్షన్ సీన్స్ .. ఛేజింగ్ సీన్స్ ఆడియన్స్ ను ఆశ్చర్యచకితులను చేస్తాయని అంటున్నారు. మోహన్ లాల్ .. ఆర్య .. బొమన్ ఇరాని కీలకపాత్రల్లో కనిపించనున్నారు.  
surya
sayesha

More Telugu News