basketball: నేను బాస్కెట్ బాల్‌లా ఉండేవాడిని.. అందుకనే నటన గురించి ఆలోచించలేదు: అర్జున్ కపూర్

  • డైరెక్టర్‌ను కావాలనుకున్నా
  • దిల్ చాహతాహై చూశాక ఆశలు చిగురించాయి
  • ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ గురించి తెలియని వారుండరు. నిత్యం షూటింగులతో బిజీగా ఉండే అర్జున్ తాజాగా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. నిజానికి తాను నటుడిని కావాలనుకోలేదని, దర్శకత్వం వైపు వెళ్దామనుకున్నానని పేర్కొన్నాడు. చూడడానికి తాను బాస్కెట్ బాల్‌లా ఉండేవాడినని, కాబట్టి నటన గురించి ఆలోచించలేకపోయానని పేర్కొన్నాడు.

ఇంగ్లిష్ మూవీ ‘లాక్ స్టాక్ అండ్ టు స్మోకింగ్ బ్యారెల్స్’ చూసిన తర్వాత తాను డైరెక్టర్ కావాలనుకున్నానని, అయితే ఎందుకో తెలియదన్నాడు. తనకింకా గుర్తుందని, పదో తరగతి చదువుతున్నప్పుడు ఓ రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో సడెన్‌గా లేచి ఆ సినిమాను చూశానని వివరించాడు. హిందీ సినిమా ‘దిల్ చాహతాహై’ సినిమా చూశాక కోరికలను అణచిపెట్టుకోవడం సరికాదని తెలిసిందన్నాడు. ‘దిల్ చాహతాహై’ చూడకుంటే తన పరిస్థితి ఏమిటన్నది ఆలోచించలేనని అర్జున్ పేర్కొన్నాడు. ఈ సినిమా చూశాకే తనలో ఆశలు చిగురించాయని, నటుడిని కాగలనన్న నమ్మకం కుదిరిందని వివరించాడు. 
basketball
Arjun Kapoor
Bollywood
Dil Chahta Hai

More Telugu News