somireddy: మంత్రి సోమిరెడ్డిని ఈ మెయిల్‌లో దూషించింది 70 ఏళ్ల వృద్ధుడు!

షార్ట్స్‌లో చూడండి
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలపై ఈ మెయిల్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని ఓ 70 ఏళ్ల వృద్ధుడిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. మంత్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తులోకి దిగిన పోలీసులు అడ్రస్‌ ఆధారంగా పరిశీలించారు. మెయిల్‌ పంపిన వ్యక్తి హైదరాబాద్ కు చెందినతను కాగా, అతన్ని సీనియర్ సిటిజన్ గా గుర్తించారు. దీంతో ఆశ్చర్యపోయిన పోలీసులు విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని, ఆ వృద్ధుడిని ఇబ్బంది పెట్టవద్దని సూచించినట్లు సమాచారం.
Go Back to Shorts
somireddy
-Telugudesam
Andhra Pradesh

More Telugu News