Vizag: విశాఖ 'కన్య-శ్రీకన్య' థియేటర్లలో భారీ అగ్నిప్రమాదం!

  • గాజువాకలో జంట థియేటర్లు
  • షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
  • అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
విశాఖపట్నం పరిధిలోని గాజువాకలో ఉన్న జంట సినిమా థియేటర్ లు 'కన్య - శ్రీకన్య'లో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. థియేటరులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు ప్రాథమిక అంచనా. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నాయి.

 మంటలు దట్టంగా ఉండటంతో, చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న అధికారులు, వారిని ఖాళీ చేయించారు. గత రాత్రి సెకండ్ షో ముగిసిన తరువాత షార్ట్ సర్క్యూట్ సంభవించివుండవచ్చని థియేటర్ల నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తప్ప ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.
Vizag
Gajuwaka
Kanya Srikanya
Theaters
Fire Accident

More Telugu News