Huzurabad: టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్యే శరణ్యం.. కేసీఆర్‌కు శ్రీకాంతాచారి తల్లి హెచ్చరిక!

  • హుజూరాబాద్ టికెట్ ఇవ్వాల్సిందే
  • లేకుంటే ప్రాణత్యాగానికైనా సిద్ధం
  • టికెట్ రాకుండా జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారు
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హెచ్చరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు టికెట్ ఇవ్వాలనుకుంటున్నా, మంత్రి జగదీశ్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. రానున్న ఎన్నికల్లో తనకు హుజూరాబాద్ టికెట్ కేటాయించాలని, లేదంటే ప్రాణత్యాగానికైనా వెనుకాడబోనని హెచ్చరించారు.

గత ఎన్నికల్లో తాను 47 వేల ఓట్లు సాధించానని, ఓటమి పాలైనప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ న్యాయం చేస్తారన్న ఆమె, తనకు హుజూరాబాద్ టికెట్ మాత్రమే కావాలన్నారు. అది తప్ప మరెక్కడ ఇచ్చినా పోటీ చేయబోనన్నారు. తనకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నా, జిల్లాకే చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుకుంటున్నారని శంకరమ్మ ఆరోపించారు.
Huzurabad
Telangana
TRS
KCR
Shakaramma

More Telugu News