Telangana: గుప్త నిధుల కోసం శివాలయంలో బాంబు పేలుళ్లు!

  • తెలంగాణలోని  మహబూబ్ నగర్ లో ఘటన
  • స్వామివారి విగ్రహాన్ని కదిలించేందుకు యత్నం
  • రంగంలోకి దిగిన పోలీసులు
తెలంగాణలో గుప్తనిధుల ముఠా రెచ్చిపోయింది. ఓ పురాతన శివాలయంలో నిధుల కోసం స్వామివారి విగ్రహాన్ని పేల్చేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మరికల్ గ్రామ సమీపంలో కోటచింతల బసవన్న దేవాలయం ఉంది. ఇది పాత ఆలయం కావడంతో పరమశివుడి విగ్రహం కింద గుప్త నిధులు ఉన్నాయంటూ ప్రచారం ఉంది.

ఈ నేపథ్యంలో కొందరు దుండగులు స్వామివారి విగ్రహం దగ్గర తవ్వకాలు చేపట్టారు. అయితే ఎంతకూ విగ్రహం కదలకపోవడంతో బాంబు పెట్టి పేల్చివేశారు. మరుసటి రోజు గుడిలో ధ్వంసమైన బసవేశ్వరుడి విగ్రహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
mahabub nagar
temple siva
gupta nidhulu

More Telugu News