Amrutha: గర్భిణిని కాకుంటే ఈ పాటికి నీ దగ్గరకే వచ్చుండేదాన్నంటూ... ప్రణయ్ మృతదేహాన్ని చూసి బోరున విలపించిన అమృత!

  • ఆసుపత్రి నుంచి ప్రణయ్ ఇంటికి అమృత
  • గర్భం దాల్చకుంటే ఆత్మహత్య చేసుకునేదాన్ని
  • అమృతను ఓదార్చుతున్న బంధువులు
తన భర్త మృతదేహాన్ని తొలిసారి చూసిన అమృత వర్షిణి గుండెలవిసేలా రోదించింది. ఈ ఉదయం ఆసుపత్రి నుంచి ప్రణయ్ ఇంటికి వెళ్లిన ఆమె, భర్తను విగతజీవిగా చూసి తట్టుకోలేకపోయింది. తన భర్త మరణించాడని తెలియగానే, తాను కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాలని అనుకున్నానని, అయితే, ప్రణయ్ ప్రతిరూపంగా తన కడుపులో పెరుగుతున్న బేబీ కోసమే బతికున్నానని వాపోయింది.

"నేను కన్సీవ్ కాకుంటే ఈ పాటికే నీ దగ్గరికి వచ్చుండేదాన్ని" అంటూ అమృత ఏడుస్తుంటే, ఆమెను బంధువులు ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రణయ్ ఆత్మకు శాంతి కలిగేలా, తన కడుపులోని బిడ్డను కని, చక్కగా పెంచుతానని అమృత వ్యాఖ్యానించింది. కాగా, ప్రణయ్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం జరగనున్నాయి.
Amrutha
Miryalaguda
Honor Killing

More Telugu News