CHINATAMANENI PRABHAKAR: కార్మికుడిపై చింతమనేని దాడి.. విజయవాడలో కార్మిక సంఘాల ధర్నా!
- చింతమనేని ఇంటికి పిలిపించి కొట్టారు
- కులం పేరుతో దూషించారు
- ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు పెట్టాలి
ఏలూరు లిక్కర్ డిపోలో ఓ కార్మికుడిపై దాడికి పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేయాలని ఐఎఫ్టీయూ డిమాండ్ చేసింది. తన మాట వినకపోవడంతో కులం పేరుతో దూషిస్తూ చింతమనేని కొట్టారని ఐఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కె.పొలారి ఆరోపించారు. దాడికి పాల్పడిన చింతమనేనిపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ విజయవాడలోని అలంకార్ సెంటర్ లో ఉన్న ధర్నా చౌక్ లో ఆందోళనకు దిగారు.
చింతమనేని అరాచకాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పొలారి మాట్లాడుతూ 27 కేసుల్లో ముద్దాయిగా ఉన్న చింతమనేని ఏలూరు లిక్కర్ డిపోలోని హమాలీ కార్మికుడిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించారు.