sreesanth: బిగ్‌బాస్-12లోకి టీమిండియా వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్!

షార్ట్స్‌లో చూడండి
వివాదాస్పద రియాలిటీ షో బిగ్‌బాస్‌లోకి టీమిండియా వివాదాస్పద క్రికెటర్ శ్రీశాంత్ కంటెస్టెంట్‌గా వెళ్లబోతున్నాడు. హిందీ బుల్లితెరపై త్వరలోనే బిగ్‌బాస్-12 ప్రసారం కాబోతోంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ దీనికి వ్యాఖ్యాత. బిగ్‌బాస్-12 సీజన్‌లో హౌస్‌లోకి వెళ్లబోయే వారి పేర్లను అధికారికంగా విడుదల చేశారు. వీరిలో టీమిండియా క్రికెటర్, కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ కూడా ఉన్నాడు. మొత్తం 18 మంది బిగ్‌బాస్ హౌస్‌లో వంద రోజులు గడపనున్నారు. తెలుగు బిగ్‌బాస్‌లానే హిందీలోనూ ఈసారి కామన్ మెన్ హౌస్‌లోకి వెళ్లబోతున్నారు. కాగా, షోలో తొలిసారి కొందరు జంటగా వెళ్లబోతున్నారు. అలా వెళ్తున్న వారిలో అక్కాచెల్లెళ్లు, ఓ లాయరు-పోలీసు, ఇద్దరు సింగర్లు కూడా ఉన్నారు. అయితే, చాలామంది సెలబ్రిటీలు మాత్రం ఒంటరిగానే వెళ్తున్నారు. షోలో తొలిసారి ఓ రైతుకి కూడా అవకాశం కల్పించడం విశేషం.
Go Back to Shorts
sreesanth
TeamIndia
BigBoss
Salman Khan
Bollywood

More Telugu News