kolkata: కోల్‌కతాలోని బగ్రీ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది!

  • శనివారం తెల్లవారుజామున అంటుకున్న మంటలు
  • క్షణాల్లోనే మార్కెట్ మొత్తం వ్యాపించిన వైనం
  • నివాస స్థలాలను ఖాళీ చేయించిన అధికారులు
కోల్‌కతాలోని బగ్రీ మార్కెట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కానింగ్ స్ట్రీట్‌లో ఉన్న ఈ మార్కెట్లో ఈ తెల్లవారు జామున 2:45 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత చిన్నగా మొదలైన మంటలు క్షణాల్లోనే మార్కెట్ మొత్తం విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

 అయితే, మంటలను అదుపు చేసేందుకు అవి సరిపోకపోవడంతో మరికొన్నింటిని రప్పించారు. మొత్తం 20 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. చుట్టుపక్కల భవనాలు, నివాస స్థలాలు ఉండడంతో జనాలను ఖాళీ చేయించారు. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదని కోల్‌కతా మేయర్ సోవన్ ఛటర్జీ తెలిపారు. కాగా, ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.  
kolkata
Fire
India
Bagri Market
Canning Street

More Telugu News