Amit Shah: అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఐవైఆర్ కృష్ణారావు!

  • అమిత్ షాను కలిసి పార్టీలో చేరిన ఐవైఆర్
  • గతంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన కృష్ణారావు
  • అధికార టీడీపీని ఇరుకునపెట్టేలా విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను హైదరాబాద్ లో కలిసిన ఆయన, ఆ పార్టీలో చేరారు. కృష్ణారావును ఆహ్వానించిన అమిత్ షా, ఆయనకు పార్టీ కండువాను కప్పారు. ఐవైఆర్ కృష్ణారావు వెంట బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఐవైఆర్, ఆ తరువాత చంద్రబాబును ఇరుకున పడేసేలా విమర్శలు చేసి, ఆ పదవికి దూరమైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన విమర్శలు సైతం అధికార పార్టీలో కలకలం రేపాయి. ఇప్పుడాయన బీజేపీలో చేరడం గమనార్హం. 
Amit Shah
IYR Krishnarao
BJP
Kanna Lakshminarayana

More Telugu News