sri reddy: రెండు రాజకీయ పార్టీల నుంచి నాకు ఆఫర్ ఉంది!: శ్రీరెడ్డి

  • సైదాబాద్ లో బేకరీ ప్రారంభించిన నటి
  • రాజకీయాల్లోకి రావాలని కొందరు కోరుతున్నారు
  • పాలిటిక్స్ లోకి వచ్చే ఆసక్తి లేదు
తన రాజకీయ ప్రవేశంపై నటి శ్రీరెడ్డి స్పందించింది. ప్రస్తుతం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని ఆమె తెలిపింది. రాజకీయాల్లోకి రావాలని తనను రెండు పార్టీలు ఆహ్వానిస్తున్నాయని వెల్లడించింది. అయితే రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని వాళ్లకు చెప్పానని పేర్కొంది. సైదాబాద్ లో జరిగిన ఓ బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొంది.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఘోర పరాభవం తప్పదని శ్రీరెడ్డి జోస్యం చెప్పింది. జనసేన కేవలం 3-4 సీట్లకే పరిమితమయ్యే అవకాశముందని వ్యాఖ్యానించింది. తాను ఫలానా రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
sri reddy
Tollywood
pavan lkalyan
political parties

More Telugu News