West Godavari District: పాతబాకీ తీర్చమన్నందుకు హత్యాయత్నం!

  • పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం బీమోలులో దారుణం
  • తీవ్రంగా గాయపడిన బాధితుడు
  • రాజమండ్రి ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
అప్పు తీర్చమని అడిగిన పాపానికి రుణదాతపై ఏకంగా హత్యాయత్నం చేశాడో ప్రబుద్ధుడు. అతనిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం బీమోలులో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ (50) కిళ్లీ కొట్టు నిర్వహిస్తున్నాడు. వంశీ అనే యువకుడు అతని వద్దకు సిగరెట్‌ కొనేందుకు వచ్చాడు. ఆ సందర్భంలో పాతబాకీ కట్టాలని శ్రీనివాస్‌ పట్టుబట్టాడు. దీంతో ఆగ్రహోదగ్రుడైన వంశీ అక్కడే ఉన్న పెట్రోల్‌ శ్రీనివాస్‌పై పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
West Godavari District
Andhra Pradesh

More Telugu News