Rahul Gandhi: బెయిలుపై వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్.. రాహుల్‌ను ఎద్దేవా చేసిన బీజేపీ.. విరుచుకుపడుతున్న నెటిజన్లు!

  • నేషనల్ హెరాల్డ్ కేసులో ఏ2గా రాహుల్
  • బెయిలొచ్చి వెయ్యి రోజులు
  • గుర్తు చేసి ఎద్దేవా చేసిన బీజేపీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి బీజేపీ అభినందనలు తెలిపింది. ఓ కేసులో ఏ2 నిందితుడిగా ఉండి బెయిలుపై వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నందుకు కంగ్రాట్స్ అని ఎద్దేవా చేస్తూ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ ఏ2 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిలుపై ఉన్న ఆయనకు బీజేపీ కంగ్రాట్స్ చెబుతూ సెటైర్లు వేసింది. ‘‘వెయ్యి రోజులు బయట ఉండడం ఎలా ఉంది?’’ అని చివర్లో పేర్కొంది.  

బీజేపీ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. రాహుల్ బెయిలుపై ఎన్ని రోజులు బయట ఉన్నారో లెక్కిస్తూ కూర్చోవడం తప్ప బీజేపీకి మరో పనిలేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. గుజరాత్ అల్లర్ల కేసు సహా మరెన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్న బీజేపీ చీఫ్ అమిత్ షా బయట ఉండడం ఎలా ఉంది? అని మరొకరు ప్రశ్నించారు. థర్డ్ రేట్ క్రిమినల్ అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా ఉండడాన్ని చూసి బీజేపీ చాలా గర్వపడుతోందని మరొకరు ఎద్దేవా చేశారు.
Rahul Gandhi
BjP
Congress
Amit shah
Twitter

More Telugu News