Hyderabad: రాజకీయ ప్రవేశంపై అమ్మవారిదే తుది నిర్ణయమన్న పరిపూర్ణానంద స్వామి

షార్ట్స్‌లో చూడండి
అమ్మవారు అనుగ్రహిస్తే త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తానంటూ శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద (46) పేర్కొన్నారు. అమ్మవారి ఆదేశానుసారమే నడుచుకుంటానని తెలిపారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అందరితో సంప్రదింపులు జరుపుతున్నానని పేర్కొన్నారు. అన్ని విషయాలు పూర్తిగా చర్చించిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుంటానని వివరించారు.

రాజకీయాల్లోకి వచ్చినా పీఠాధిపతిగా తనకు దక్కిన ఉత్కృష్టమైన స్థానాన్ని మాత్రం వదులుకోబోనన్నారు. తన జీవితంలో ఏ నిర్ణయమైనా అమ్మవారికే వదిలివేస్తానని, ఆమె అనుగ్రహం ప్రకారమే నడుచుకుంటానన్నారు. కాగా, పరిపూర్ణానంద బీజేపీ‌లో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లోనే పరిపూర్ణానంద రాజకీయ ప్రవేశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Go Back to Shorts
Hyderabad
Paripurnanda
BJP
TRS
Politics

More Telugu News