kumaraswamy: మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ పెద్దలు కుట్ర చేస్తున్నారు: కుమారస్వామి

  • జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేందుకు యత్నిస్తున్నారు
  • ముడుపులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు
  • బీజేపీ పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని జేడీఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేందుకు, వారికి ముడుపులు ఇచ్చేందుకు యత్నిస్తున్నారని... ఇలాంటి అప్రజాస్వామిక పద్ధతులకు పాల్పడుతున్న బీజేపీ పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలను ఉంచేందుకు కొన్ని రిసార్టులను సిద్ధం చేసినట్టు మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయని... ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని చెప్పారు. 
kumaraswamy
bjp
jds
congress

More Telugu News