sensex: కొంచెం బలపడ్డ రూపాయి.. 373 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. రూపాయి విలువ కొంచెం బలపడటంతో పాటు, ప్రధాని మోదీ ఆర్థిక సమీక్షను నిర్వహించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 373 పాయింట్లు పెరిగి 38,091కి చేరుకుంది. నిఫ్టీ 145 పాయింట్లు లాభపడి 11,515కు ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బలరాంపూర్ చీనీ మిల్స్ (13.81%), గ్రాన్యూల్స్ ఇండియా (10.17%), రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ (9.15%), యూఫ్లెక్స్ (9.14%), జిందాల్ సా (7.82%).

టాప్ లూజర్స్:
అశోక బిల్డ్ కాన్ (-5.92%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-5.37%), క్వాలిటీ (-4.43%), సియెంట్ లిమిటెడ్ (-3.13%), వెల్స్ పన్ కార్ప్ (-2.94%).      
Go Back to Shorts
sensex
nifty
stock market

More Telugu News