అన్ని ప్రాంతాలకు నీరు ఇచ్చేంత వరకు ఈ దీక్ష ఆగదు: చంద్రబాబు
- శ్రీశైలం వద్ద జలసిరికి హారతి ఇచ్చిన చంద్రబాబు
- రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడమే లక్ష్యమన్న సీఎం
- నీరు పుష్కలంగా ఉంటేనే ప్రాజెక్టులు వస్తాయి
గోదావరి నీటిని కృష్ణానదికి తీసుకురావాలని గతంలో సంకల్పం చేశామని... చెప్పిన విధంగానే చేసి, చూపామని చంద్రబాబు అన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకుని, భూగర్భ జలాలను పెంచుకోవడానికి ప్రతి ఒక్కరు తమ వంతు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.