Jammu And Kashmir: కశ్మీర్‌లో నదిలో పడిపోయిన బస్సు.. 13 మంది మృతి

  • కిస్ట్ వర్‌ జిల్లాలోని థాక్రీ వద్ద ఘటన
  • ప్రమాద సమయానికి బస్సులో 30 మంది ప్రయాణికులు 
  • మృతదేహాలను వెలికితీసిన గాలింపు బృందాలు
జమ్మూకశ్మీర్‌లో 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ మినీ బస్సు అదుపుతప్పి చీనాబ్‌ నదిలో పడిపోయిన ఘటనలో పదమూడు మంది మృతి చెందారు. కిస్ట్ వర్‌ జిల్లాలోని థాక్రీవద్ద ఈరోజు ఉదయం ఈ విషాధ ఘటన చోటుచేసుకుంది.

చనిపోయిన పదమూడు మంది మృతదేహాలను గాలింపు బృందాలు వెలికితీశాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50,000 ఇస్తున్నట్లు కిస్ట్ వర్‌ డిప్యూటీ కమిషనర్ అంగ్రేజ్ సింగ్ రాణా చెప్పారు.
Jammu And Kashmir
Road Accident

More Telugu News