Hyderabad: జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం!

  • షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు
  • ఘటనా స్థలికి చేరుకున్న రెండు ఫైరింజన్లు
  • హుటాహుటిన రోగుల తరలింపు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ప్రతిష్ఠాత్మక అపోలో ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు తెలుస్తుండగా, విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ రెండు ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ప్రమాదంతో ఆసుపత్రి సెల్లార్ మొత్తం దట్టమైన పొగతో నిండిపోగా, మంటలు పై అంతస్తులకు వ్యాపించకుండా చర్యలు చేపట్టిన సిబ్బంది, రోగులను హుటాహుటిన బయటకు తరలిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Hyderabad
Jubileehills
Fire Accident
Apollo Hospital

More Telugu News