Varavara Rao: వరవరరావు గృహ నిర్బంధం పొడిగింపు!

  • గృహ నిర్బంధాన్ని ఈ నెల 17 వరకూ పొడిగించిన సుప్రీం 
  • హేమలత పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు 
  • సీనియర్ ఫిజీషియన్‌ను ఇంటికి పంపాలని ఆదేశం
విరసం నేత వరవరరావు గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు పొడిగించింది. సీజే దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వరవరరావు, మరో నలుగురు మానవ హక్కుల నేతల నిర్బంధాన్ని ఈనెల 17 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు, తన భర్తకు వైద్యం నిమిత్తం డాక్టర్‌ను అనుమతించాలంటూ వరవరరావు భార్య హేమలత దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నిన్న స్పందించింది. వరవరరావుకు చికిత్స అందించేందుకు గాంధీ ఆసుపత్రి సీనియర్ ఫిజీషియన్‌ను ఆయన ఇంటికి పంపాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. వరవరరావుకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, జస్టిస్ శ్యామ్ ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం సూచించింది.
Varavara Rao

More Telugu News