paul collingwood: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కోలింగ్ వుడ్

  • 2010-11లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు
  • అనంతరం డొమెస్టిక్ క్రికెట్, కోచింగ్ కు పరిమితం
  • నా శక్తి చివరి భాగాన్ని కూడా క్రికెట్ కే అందించానన్న కోలింగ్ వుడ్

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ఆ జట్టు ఆల్ రౌండర్ పాల్ కోలింగ్ వుడ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 2010-11 యాషెస్ సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కోలింగ్ వుడ్... ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్, కోచింగ్ కు పరిమితమయ్యాడు. ఇంగ్లండ్ తరపున పాల్ మొత్తం 68 టెస్టులు, 197 వన్డేలు, 36 టీ20లు ఆడాడు. కోలింగ్ వుడ్ రిటైర్మెంట్ పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. 'పాల్... మాకు ఎన్నో జ్ఞాపకాలు అందించిన నీకు ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేసింది.

తన రిటైర్మెంట్ పై కోలింగ్ వుడ్ మాట్లాడుతూ, ఈ సీజన్ ముగిసిన తర్వాత రిటైర్ అవుదామని చాలా కాలంగా ఆలోచించానని చెప్పాడు. ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన నిర్ణయమని, కానీ, ఈ నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమని తెలిపాడు. తన శక్తిలో చివరి భాగాన్ని కూడా క్రికెట్ కే అందించడం సంతోషంగా ఉందని చెప్పాడు.

More Telugu News