Laxman: బీజేపీని టీడీపీ ఓడిస్తాననడం హాస్యాస్పదం: లక్ష్మణ్‌

  • 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీజేపీ మేనిఫెస్టో
  • అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్న యోచన
  • ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు అవకాశం  
పాలమూరులో ఈనెల 15వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఇరవై ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మ్యానిఫెస్టో రూపొందించనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పించే యోచన పార్టీ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో గల్లంతైన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని ఓడిస్తామనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 
Laxman
BJP
Telangana

More Telugu News