Chandrababu: సతీసమేతంగా తిరుమలకు చేరుకున్న చంద్రబాబునాయుడు

  • ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్‌, ఈఓ
  • ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో పాల్గొననున్న బాబు
  • సాయంత్రం ఏడుగంటలకు ఆలయంలోకి ప్రవేశం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీసమేతంగా తిరుమల కొండకు చేరుకున్నారు. సాయంత్రం మకరలగ్నంలో ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున పాల్గొంటారు. ఏడు గంటలకు  బేడి ఆంజనేయస్వామి మండపం నుంచి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

ఈ రోజు మధ్యాహ్నం విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వచ్చారు. కొండపై ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఘన స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల వేళ ముఖ్యమంత్రి పర్యటిస్తుండడంతో టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
Chandrababu
Telugudesam
Tirumala

More Telugu News