Andhra Pradesh: పండుగ రోజున పెను విషాదం.. విద్యుత్ షాక్ తో ఇద్దరు పిల్లలు సహా తండ్రి మృతి!

  • గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో దారుణం
  • టీవీకి డిష్ కేబుల్ బిగిస్తుండగా ఘటన
  • విచారణ జరుపుతున్న పోలీసులు
వినాయక చవితి పర్వదినం రోజున ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సోదరుడి గృహ ప్రవేశానికి వచ్చిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో ఇద్దరు పిల్లలు తండ్రిని పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి వారు కూడా కన్నుమూశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడులో ఈ రోజు ఉదయం చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లాకు చెందిన చెందిన గుమ్మడి ఏసు (28), తన కుటుంబంతో కలిసి సోదరుడి గృహప్రవేశం కోసం ప్రత్తిపాడు మండలం గనికపూడి గ్రామానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం అన్న ఇంట్లోని టీవీకి డిష్ కేబుల్ ను బిగిస్తుండగా అందులో విద్యుత్ సరఫరా జరిగింది. దీంతో ఏసు అక్కడిక్కడే చనిపోయాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న పిల్లలు సాల్మన్ రాజు (5), కుమార్తె ఎస్తేరు రాణి (4) పొరపాటున తండ్రిని పట్టుకోవడంతో వారికీ విద్యుత్ షాక్ తగిలింది. దీంతో వారు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Andhra Pradesh
electric shock
Guntur District
prattipadu

More Telugu News