కొండగట్టులో ప్రమాదానికి ఆంజనేయ స్వామి ఆగ్రహమే కారణమంటున్న ప్రజలు!
- కొడిమ్యాలలో 60 వానరాల కళేబరాలు లభ్యం
- దొరికిన రెండ్రోజులకే ఘాట్ రోడ్డులో ప్రమాదం
- అంజన్న ఆగ్రహమే కారణమంటున్న గ్రామస్తులు
మరోపక్క, కొండగట్టు ప్రమాదంలో ఇప్పటికి 60 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 60 వానరాలను హతమార్చడంతోనే ఆంజనేయ స్వామికి ఆగ్రహం వచ్చిందనీ, దీంతో ఘాట్ రోడ్డులో ప్రమాదం సంభవించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వానరాల కళేబరాలు లభ్యమైన రెండు రోజులకే ఈ ప్రమాదం జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై పలు గ్రామాల ప్రజలు అంజన్నకు ఆగ్రహం రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.