Jagan: యూపీ కేబినెట్ లో కూడా ముస్లిం ఉన్నారు.. ఏపీ కేబినెట్ లోనే లేరు!: వైఎస్ జగన్

  • చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికీ మేలు జరగలేదు
  • ముస్లిం మైనారిటీలకు బాబు చేసింది శూన్యం
  • విశాఖలో ముస్లింలతో ఆత్మీయ సమ్మేళనంలో జగన్
ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో ప్రతి అడుగులోనూ మోసమేనని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. విశాఖపట్టణంలోని అరిలోవ బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహిస్తున్న ముస్లింలతో ఆత్మీయ సమ్మేళనం సదస్సులో జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికీ మేలు జరగలేదని, మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయలేదని, ఆయన హయాంలో ముస్లిం మైనారిటీలకు చేసింది శూన్యమని అన్నారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో కూడా ముస్లింలకు ప్రాతినిధ్యం ఉంది కానీ, చంద్రబాబు కేబినెట్ లో మాత్రం ఒక్క ముస్లింకూ అవకాశం కల్పించలేదని విమర్శించారు. నాలుగేళ్లు చిలుకాగోరింకల లాగా బీజేపీ-టీడీపీలు సంసారం చేశాయని, ఇప్పుడు విడాకులు తీసుకున్నాయని, నాడు బీజేపీని మంచిదంటూ పొగడ్తలతో ముంచెత్తిన చంద్రబాబు.. ఇప్పుడు ఆ పార్టీని విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. 
Jagan
Visakhapatnam District

More Telugu News