rashmika mandanna: రష్మికను ప్రశాంతంగా ఉండనివ్వండి: మాజీ ప్రియుడు రక్షిత్

  • రష్మిక గురించి అందరికంటే నాకే ఎక్కువ తెలుసు
  • మీడియా వార్తలను నమ్మవద్దు
  • రష్మికను జడ్జ్ చేసే ప్రయత్నం చేయవద్దు
'గీత గోవిందం' ఫేమ్ రష్మిక మందన నిశ్చితార్థం రద్దయినట్టు ఆమె తల్లి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని రష్మిక కూడా నిర్ధారించింది. కన్నడ నటుడు, నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక, అతనితో పెళ్లికి సిద్ధపడింది. పెద్దల సమక్షంలో ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగింది. అయితే కొంత కాలానికే ఇద్దరూ ఒకరికొకరు దూరమయ్యారు.

 ఈ నేపథ్యంలో వీరి ఎంగేజ్ మెంట్ రద్దయింది. ఈ విషయాన్ని ఆమె తల్లి స్పష్టం చేయగా... అదే సమయంలో ట్విట్టర్ నుంచి రక్షిత్ వైదొలగాడు. దీంతో, రక్షిత్ అభిమానులు రష్మికను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే, రష్మికను ట్రోల్ చేయవద్దంటూ అభిమానులను ఫేస్ బుక్ ద్వారా రక్షిత్ కోరాడు.

కొన్ని ముఖ్యమైన పనుల వల్లే తాను ట్విట్టర్ కు దూరమయ్యానని రక్షిత్ తెలిపాడు. మీకు క్లారిటీ ఇవ్వడానికి ఫేస్ బుక్ ద్వారా వెనక్కి వచ్చానని చెప్పాడు. మీ అందరికీ రష్మిక గురించి కొంచెం నెగెటివ్ అభిప్రాయం ఉండవచ్చని, అందులో మీ తప్పు లేదని, సమస్య అలా ప్రొజెక్ట్ అయిందని అన్నాడు. మనం వినేవి, చూసేవి ఒక్కోసారి నిజం కావని, రష్మిక తనకు రెండేళ్లుగా పరిచయమని, మీ అందరికంటే ఆమె గురించి తనకే ఎక్కువ తెలుసని చెప్పాడు. ఈ విషయంలో మీడియా వార్తలను ఫాలో కావద్దని... తమ విషయాలు మీడియాకు తెలియవని అన్నాడు. రష్మికను ప్రశాంతంగా ఉండనివ్వాలని... ఆమెను జడ్జ్ చేసే ప్రయత్నం చేయవద్దని కోరాడు. 
rashmika mandanna
rakshit shetty
engagement
tollywood

More Telugu News