bhuma: పచ్చని సంసారం.. భర్తతో కలసి వరినాట్లు వేసిన అఖిలప్రియ!

  • రుద్రవరం గ్రామ సమీపంలో వరినాట్లు వేసిన నూతన దంపతులు
  • ట్విట్టర్ ద్వారా అనుభూతిని పంచుకున్న అఖిలప్రియ
  • ప్రజల మధ్య ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందన్న మంత్రి
ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ తన భర్త భార్గవరామ్ నాయుడితో కలసి వరినాట్లు వేశారు. కర్నూలు జిల్లాలోని రుద్రవరం గ్రామ సమీపంలో ఉన్న పాములేటి అనే రైతు పొలంలో నూతన దంపతులు నాట్లు వేశారు. ఈ సందర్భంగా కూలీలతో ముచ్చటిస్తూ, మంచిచెడ్డలు తెలుసుకున్నారు. ఎంత కూలీ ఇస్తున్నారని ఆరా తీశారు. ఈ ఆసక్తికర సన్నివేశాన్ని అఖిలప్రియ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ప్రజల మధ్య ఉన్నప్పుడు తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా అఖిలప్రియ చెప్పారు. రైతులతో మాట్లాడానని, వారి సమస్యల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చానని తెలిపారు.
bhuma
akhilapriya
paddy

More Telugu News