Donald Trump: ట్రంప్ కంటే పెద్ద మూర్ఖుడు ఎవ్వరూ ఉండరు!: రామ్ గోపాల్ వర్మ

  • ఆయనకు నిజాయితీ లేదని వెల్లడి
  • ట్విట్టర్ లో స్పందించిన దర్శకుడు
  • సోషల్ మీడియాలో నెటిజన్ల మిశ్రమ స్పందన
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు గుప్పించారు. ప్రపంచ చరిత్రలో ట్రంప్ కంటే తెలివి తక్కువ, నిజాయతీలేని నాయకుడు మరెవ్వరూ లేరని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యవహార శైలిపై వర్మ ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ప్రపంచ దేశాలకు ఇప్పటివరకూ నాయకత్వం వహించిన నేతలందరిలోనూ డొనాల్డ్ ట్రంప్ కంటే పెద్ద మూర్ఖుడు, నిజాయతీలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను నమ్మను’ అని మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్ పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి, స్థానికులకు ఉద్యోగాల కోసమే ట్రంప్ పనిచేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరేమో.. ‘టాలీవుడ్, బాలీవుడ్ అయిపోయి ఇప్పుడు హాలీవుడ్ పై పడ్డావా నాయనా?’ అని కామెంట్లు పెడుతున్నారు.
Donald Trump
USA
RAM GOPAL VARMA
DIS HONEST
dumber

More Telugu News