పోలవరం చరిత్రలో మరో మైలురాయి.. గ్యాలరీ వాక్ ను ప్రారంభించిన చంద్రబాబు
- కుటుంబసభ్యులతో కలసి గ్యాలరీ వాక్ చేసిన చంద్రబాబు
- కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- పోలవరం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత
దాదాపు 2 వేల మంది పోలీసు సిబ్బందితో ఈ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా వైపు ఉన్న అడవుల్లో గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కు చెందిన వెయ్యి మంది కూంబింగ్ నిర్వహించారు. పోలవరం పరిసర ప్రాంతాలన్నింటినీ నిన్ననే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి బందోబస్తును 11 సెక్టార్లుగా విభజించారు.
గ్యాలరీ ప్రారంభానికి ముందు తన కుటుంబసభ్యులతో కలసి చంద్రబాబు అమరావతి నుంచి పోలవరంకు హెలికాప్టర్ లో చేరుకున్నారు. గ్యాలరీ ప్రారంభం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.