Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సత్కరించిన ఆర్యవైశ్యులు!

  • ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం
  • సీఎం ను ఛాంబర్ లో కలసిన నేతలు
  • ఆశీర్వచనాలు అందజేసిన వేదపండితుడు
ఆర్యవైశ్యులను అన్నిరకాలుగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆర్యవైశ్య సంఘం ముఖ్యనేతలు సీఎం చంద్రబాబు నాయుడిని ఘనంగా సత్కరించారు.

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని సీఎం ఛాంబర్ కు నిన్న వెళ్లిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, మాజీ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వరరావు, నాగబాబు, కనకరాజు తదితరులు ముఖ్యమంత్రి చంద్రబాబును సత్కరించారు. తమ సామాజికవర్గాన్ని ఆదుకునేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఆర్యవైశ్య నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితుడు సంగుభొట్ల శ్రీనివాసశర్మ సీఎంకు ఆశీర్వచనాలు అందజేశారు.
Chandrababu
Andhra Pradesh
aryavysa community
falicitation
amaravati

More Telugu News