jagityala: మృతుల కుటుంబాలకు మంత్రుల పరామర్శ.. జగిత్యాల ఆర్టీసీ డీఎంపై సస్పెన్షన్ వేటు!

  • జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన మంత్రులు
  • మృతుల కుటుంబీకుల కన్నీటి పర్యంతం
  • ఓదార్చిన మంత్రులు
జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులను టీ మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ కవిత పరామర్శించారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితుల కుటుంబసభ్యులను ఓదార్చారు. కవిత ముందు మృతుల కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి.

జగిత్యాల ఆర్టీసీ డీఎం సస్పెన్షన్ 

కొండగట్టు ఘటనకు బాధ్యులుగా జగిత్యాల ఆర్టీసీ డీఎం హనుమంతరావుపై వేటు పడింది. హనుమంతరావును సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. బస్సు ఓవర్ లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు భావించి డీఎంను సస్పెండ్ చేసినట్టు మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు.
jagityala
kondagattu
KTR

More Telugu News