తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్: రిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్
- రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాలూ
- తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారంటూ వైద్యుల రిపోర్ట్
- కుమారుల ఆధిపత్య పోరుతో ఆందోళన
లాలూ పరిస్థితిని మెరుగుపరిచేందుకు సైకియాట్రిస్టుకు బాధ్యతలను అప్పగించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. సైకియాట్రిస్టుకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దాణా కుంభకోణంలో జైలు శిక్షను అనుభవిస్తున్న లాలూ... ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తన కుమారులిద్దరి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు కూడా లాలూను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు.