Kerala: పండుటాకు పెద్ద మనసు..కేరళ వరద బాధితులకు ఆర్థిక సాయం!

  • కేరళ వరద బాధితులకు వృద్ధురాలు రూ.10 వేలు విరాళం
  • ఏ ఆధారం లేకున్నా దాతృత్వంలో మిన్న
  • నిరాశ్రయులూ నా బిడ్డల వంటి వారే అని వ్యాఖ్య
దాతృత్వానికి కొలమానం లేదు. ధనిక, పేద తారతమ్యం లేదు. పెద్దమనసుంటే చాలు. ఆ వృద్ధురాలి వితరణ చూస్తే ఇది ఎంత నిజమో అర్థమవుతుంది. ఖరగ్‌పూర్‌ సబ్‌ డివిజన్‌ ఖదురయికి చెందిన 80 ఏళ్ల గౌరీపండాకు ఏ ఆధారమూ లేదు. కానీ ఇటీవల కేరళలో వరద విలయ తాండవంతో లక్షలాది మంది కట్టుబట్టలతో మిగిలారు. ఉండడానికి నీడ, తినడానికి తిండిలేని బాధితుల యాతన చూసి గౌరీపండా ఆవేదనకు లోనయ్యారు. తాను దాచుకున్న పదివేల రూపాయలను బాధితులకు విరాళంగా అందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. వారూ నా బిడ్డల వంటి వారే అని వ్యాఖ్యానిస్తున్న గౌరీపండా దాతృత్వాన్ని పలువురు కొనియాడారు.
Kerala
gouri panda

More Telugu News