Andhra Pradesh: సైకో అన్న అనుమానంతో చితకబాదేశారు!

  • తీవ్రంగా గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి
  • తలపైనా, ఒంటిపైనా పెద్ద గాయాలు
  • సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఘటన
అతను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. తన మానాన తాను నడిచి వెళ్తుండగా పలువురు చుట్టుముట్టారు. సైకో అన్న అనుమానంతో చితకబాదేశారు. దీంతో శరీరంపై తీవ్రగాయాలతో ఈ గుర్తు తెలియని వ్యక్తి ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. సోమవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో పి.గన్నవరం మండలం జి.పెదపూడి, కొత్తపేట మండలం గంటి గ్రామాల మధ్య ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్థులు దాడికి పాల్పడిన అనంతరం ఫోన్‌లో పోలీసులకు సమాచారమిచ్చారు. హెచ్‌సీ నూకరాజు, కానిస్టేబుళ్లు జి.పెదపూడి వెళ్లి క్షతగాత్రుడిని పి.గన్నవరం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో 108 అంబులెన్స్‌లో అమలాపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Andhra Pradesh
Crime News

More Telugu News