Andhra Pradesh: కర్నూలు జిల్లాలో దారుణం.. టీడీపీ కార్యకర్త దారుణ హత్య

  • బండరాయితో మోది చంపిన దుండగులు
  • పాతకక్షలే కారణం
  • గ్రామంలో ఉద్రిక్తత
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అలంకొండకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పందిర్లపల్లిలో రేషన్ డీలర్‌గా వ్యవహరిస్తున్న ఆయనను దుండగులు బండరాయితో మోది హతమార్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

రామకృష్ణ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, ఈ హత్యను ఖండించిన టీడీపీ నేతలు, హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రామకృష్ణ కుటుంబానికి సానుభూతి తెలిపి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా, హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
Andhra Pradesh
Kurnool District
Telugudesam Worker
Murder

More Telugu News