Ponnam Prabhakar: టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోంది: కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్

  • కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు
  • కొన్ని నియోజకవర్గాల్లో నిరసనలు తలెత్తాయి
  • ఇప్పటికే 40 మంది అభ్యర్థులను మా అధిష్ఠానం ఖరారు చేసింది
తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ క్రమేపీ పడిపోతోందని టీ-కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించినప్పటికీ చాలా చోట్ల అసమ్మతి సెగలు మొదలయ్యాయని, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల కమిటీ ఏర్పాటు చేస్తుందని, టీఆర్ఎస్ లో మాత్రం అలాంటిదేమీ జరగలేదని విమర్శించారు.

కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని, దాని ఫలితంగానే ఈ రోజున కొన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయని అన్నారు. తమ పార్టీ విషయానికి వస్తే, అధికారంలోకి వచ్చే విధంగా తమ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఇప్పటికే 40 మంది అభ్యర్థులను తమ అధిష్ఠానం ఖరారు చేసిందని పొన్నం చెప్పారు.
Ponnam Prabhakar
kcr
TRS

More Telugu News